సోనియా...హ్యాపీ...హ్యాపీ...!

నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విపరీతంగా బిజీగా ఉన్న సోనియా గాంధీ రాహుల్ కు అధ్యక్ష పదవిని అప్పగించిన తర్వాత ఆమె ఫ్రీ అయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. పార్లమెంటు సమావేశాలు జరగుతున్నప్పటికీ ఆమె ప్రశాంతతను కోరుకున్నట్లుంది. అందుకే సోనియా ఇప్పుడు గోవాలో ఉన్నారు. అక్కడ ఒక రిసార్ట్ లో ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
గోవాలో ఆనందంగా...
సోనియా గాంధీ ఇప్పుడు పూర్తిగా ఫ్రీ అయ్యారు. రాజకీయపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో ఆమె ఈ నెల 26వ తేదీన గోవా వెళ్లారు. దక్షిణ గోవాలోని లీలా హోటల్ లో బస చేసిన సోనియా సైక్లింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. సోనియాతో అనేకమంది సెల్ఫీలు దిగుతున్నారు. వారితో ఓపిగ్గా ఫొటోలు దిగుతున్న సోనియా వారిని ఆప్యాయంగా పలకరిస్తన్నారు. గత ఇరవై ఏళ్ల నుంచి ఎడతెరిపి లేకుండా రాజకీయాలతో బిజీగా ఉన్న సోనియా గాంధీ వాటన్నింటికీ దూరంగా హ్యపీ...హ్యాపీగా గోవాల్ ఎంజాయ్ చేస్తుండటం, ఆ ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చేస్తుండటం విశేషం. సోనియాగాంధీ జనవరి నెల మొదటి వారం వరకూ గోవాలోనే ఉండనట్లు తెలిసింది.
- Tags
- సోనియా గాంధీ

