Fri Mar 27 2026 05:29:19 GMT+0530 (India Standard Time)
సెంటిమెంట్ ను అర్థం చేసుకోలేక పోయింది

పార్టీ ఆదేశాలకు మేరకు మంత్రి పదవులకు రాజీనామా చేశామని అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం శాయశక్తులా ప్రయత్నం చేశామన్నారు. అయితే సెంటిమెంట్ ఏపీ ప్రజల్లో బలంగా ఉండటంతో తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నామని చెప్పారు. జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోడీకి తమ రాజీనామా లేఖలు ఇచ్చి వచ్చామన్నారు. తమ పార్టీ అధినేత ఆదేశాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. విభజన అనంతరం ఏపీకి అన్యాయం జరిగిందని, సెంటిమెంట్ ను అర్థం చేసుకోవాలని తాము ప్రధానికి వివరించినట్లు తెలిపారు. ఏపీ ప్రజలు ఎన్నో త్యాగాలుచేశారని, తాము పదవులను త్యజించడం పెద్ద గొప్పేమీ కాదన్నారు.
Next Story

