Sat Apr 11 2026 06:30:17 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టులో జగన్

వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన ఈరోజు సీబీఐ కోర్టుకు వచ్చారు. జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా వచ్చారు. కోర్టు పనులు ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రానికి జగన్ తిరుమల చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని కడప బయలుదేరి వెళతారు.
- Tags
- జగన్
Next Story

