Sun Apr 12 2026 22:52:14 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టు తీర్పుపై జగన్ లో టెన్షన్

సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. తాను నవంబర్ 2వ తేదీనుంచి పాదయాత్ర చేపడతున్నానని, తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆరు నెలలు మినహాయింపు ఇస్తే సరిపోతుందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే సీబీఐ న్యాయవాది మాత్రం జగన్ కు కోర్టు హాజరు నుంచి మినహాయింపుఇవ్వవద్దని కౌంటర్ పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరగుతుంది. తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో హైకోర్టును జగన్ ఆశ్రయించగా సీబీఐ కోర్టులోనే విన్నవించుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ వైసీపీ అభిమానుల్లో ఉంది.
- Tags
- జగన్
Next Story

