Sat Apr 11 2026 08:57:32 GMT+0530 (India Standard Time)
సీతక్క ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది?

ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క రేవంత్ వెంట వెళ్లడానికి కారణం రేవంత్ సతీమణి కారణమా? అవుననే అంటున్నారు. సీతక్క తొలుత రేవంత్ రెడ్డి వెంట వెళ్లేందుకు కొంత సంశయించారట. ముఖ్యఅనుచరులతో మాట్లాడుకున్న తర్వాతనే వెళదామని నిర్ణయించుకున్నారట. రేవంత్ నుంచి ఫోన్ వస్తుందేమోనన్న డౌట్ తో సీతక్క సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ మూడు రోజులు చేశారు. దీంతో సీతక్కను ఎలాగైనా తన వెంట ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించిన రేవంత్ రెడ్డి తన సతీమణిని రంగంలోకి దించారు. రేవంత్ సతీమణి నేరుగా సీతక్క ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చ జెప్పారట. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెంట వెళితే.. వచ్చే ప్రయోజనాలను కూడా ఆమె వివరించడంతో సీతక్క అంగీకరించారు. వెంటనే ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. రేవంత్ సతీమణి మాట్లాడిన తర్వాత సీతక్క సెల్ ఫోన్ స్విచ్ ఆన్ అయిందట.
- Tags
- సీతక్క
Next Story

