Tue Apr 30 2024 04:38:36 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కు ఘోరప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం రావడంతో వెంటనే పైలెట్ దించేశారు. దీంతో ఫడ్నవిస్ కు పెను ప్రమాదమే తప్పింది. హెలికాప్టర్ ను నడిరోడ్డుపైనే దించారు. మట్టిలో కూరుకుపోయిన హెలికాప్టర్ ను చూస్తుంటే ఫడ్నవిస్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లే కన్పిస్తోంది. అక్కడి నుంచి ఆయనను అధికారులు సురక్షితంగా రోడ్డు మార్గం ద్వారా పంపించి వేశారు. ఫడ్నవిస్ హెలికాప్టర్ కు ప్రమాదం జరిగిందని తెలియడంతో మహారాష్ట్రలో ఆందోళన వ్యక్తమయింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- Tags
- ఫడ్నవిస్
Next Story