Fri May 03 2024 04:40:39 GMT+0000 (Coordinated Universal Time)
సమంతకు కేటీఆర్ ప్రశంసలు
చేనేతకు హీరోయిన్ సమంత ఇస్తున్న చేయూత పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సమంత చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత వ్యవహరిస్తున్నారు. అయితే సమంత ఇటీవల దుబ్బాక, పోచంపల్లిలో పర్యటించి అక్కడి చేనేత కార్మికుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి పనితీరును దగ్గరుండి గమనించిన సమంత తాను చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. కొన్ని శాంపిల్స్ తీసుకుని వెళ్లి తన స్నేహితులతో కొనుగోలు చేసేలా సమంత కృషి చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సమంత చేనేతను ప్రోత్సహించేలా ముందడగు వేయడం మంచి పరిణామమని అన్నారు. సమంతకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
- Tags
- సమంత కేటీఆర్
Next Story