సచిన్ ఇంటికి కూడా బెదిరింపులా?

క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ కూతురికి వేధింపులు ఎదురయ్యాయి. టెండూల్కర్ కుమార్తె సారాను ఒక యువకుడు ఫోన్ లో బెదిరించాడు. సచిన్ కూతురు సారా ఫిర్యాదుతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ కు చెందిన దేవ్ కుమార్ సచిన్ కూతురు సారాను గత కొద్దిరోజులుగా బెదిరిస్తున్నాడు. సచిన్ ఇంట్లోని ల్యాండ్ ఫోన్ నెంబరు కనుక్కున్న దేవ్ కుమార్ దానికి నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నాడు.
మతిస్థిమితం లేదా?
తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్ చేస్తానని దేవ్ కుమార్ సారాను బెదిరించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఫోన్లు సచిన్ ఇంటికి ఆ యువకుడు ఫోన్ చేశాడు. కిడ్నాప్ చేస్తాననడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడటంతో సారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల5వ తేదీన బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెంబరు ఎక్కడి నుంచి వస్తుందని ఆరా తీశారు. టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దేవ్ కుమార్ మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మొత్తం మీద పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మానసిక పరిస్థితి బాగా లేకుంటే సచిన్ ఇంటి ఫోన్ నెంబరు ఎలా తెలిసిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత దేవ్ కుమార్ మాత్రం చాలా సార్లు సారాను టీవీల్లో చూశానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
- Tags
- సచిన్

