షూటింగ్లో విషాదం : ఇద్దరు నటులు దుర్మరణం
కర్ణాటకలో షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. హస్తిగుడి అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా జరిగిన ప్రమాదంలో విలన్ వేషాలు వేస్తున్న ఇద్దరు నటులు దుర్మరణం పాలయ్యారు. ఈ సీన్ షూటింగ్ లో హెలికాప్టర్ నుంచి హీరో, విలన్లు చెరువులోకి దూకడం అనేది సన్నివేశం కాగా, హఈరో విజయ్, విలన్ లు అనిల్, ఉదయ్ చెరువులోకి దూకారు. అయితే అక్కడే ప్రమాదం చోటు చేసుకుంది.
హీరో దునియా విజయ్ ను మాత్రం చిత్రం యూనిట్ కాపాడింది. విలన్లు ఉదయ్, అనిల్ లు చెరువులో మునిగి మరణించారు. ఫైట్ సీన్ చిత్రీకరణలో భాగంగా.. ఈ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఇది క్లయిమాక్స్ లో వచ్చే సన్నివేశంగా చెబుతున్నారు. తిప్పగుండనహల్లి చెరువులో మునిగి నటులిద్దరూ మరణించారు.
సినిమా షూటింగ్ లలో ప్రమాదాలు చోటు చేసుకోవడం కొత్త విషయం కాదు. కానీ అంతా సజావుగా జరుగుతుందని అనుకుంటున్న సమయంలో.. అంతా అనుకున్నట్లే హెలికాప్టర్ లోంచి చెరువులోకి దూకిన ఇద్దరు నటులు అక్కడికక్కడే మరణించడం చిత్ర యూనిట్ ను విషాదంలోకి నెట్టింది.