షాకింగ్.....శ్రీదేవి చనిపోయింది ఇలానా?

అందాల తార శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదట. ఆమె స్పృహ కోల్పోవడం వలన బాత్ టబ్ లో మునిగి చనిపోయారన్నది పోస్టుమార్టం నివేదిక. శ్రీదేవి మరణంపై అనేక రకాల ఊహాగానాలు విన్పించాయి. అనుమానాలు కల్గించాయి. అయితే పోస్ట్ మార్టం నివేదిక స్పష్టంగా చెప్పడంతో శ్రీదేవి మద్యం సేవించి బాత్ టబ్ లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిందని దుబాయ్ వైద్యులు ధృవీకరించారు. శ్రీదేవి శరీరంలో ఆల్కాహాల్ శాతం ఉన్నట్లు కూడా పోస్ట్ మార్టం చేసిన వైద్యులు గుర్తించారు. శవపరీక్ష అనంతరం ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఊపిరాడక.....
అయితే తొలుత శ్రీదేవి తొలుత గుండెపోటుతోనే మరణించారని అందరూ భావించారు. ఆసమయంలో హోటల్ లో భర్త బోనీ కపూర్ లేరని కూడా తెలుస్తోంది. ఆయన వచ్చిన వెంటనే శ్రీదేవి కోసం చూసి బాత్ రూమ్ తలుపు కొట్టగా తీయలేదు. దీంతో ఆయన కంగారు పడి హోటల్ సిబ్బందిని పిలిచి బాత్ రూమ్ తలుపులను బద్దలు కొట్టారు. అక్కడ శ్రీదేవి బాత్ టబ్ లోనే పడిపోయి ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం నలుగురు సీనియర్ అధికారులు సమక్షంలో విచారణ చేస్తున్నారు. శ్రీదేవి శరీరం ఎక్కువ సేపు నీళ్లలో ఉండటం వల్ల ఉబ్బిపోయిందని వైద్యులు చెబుతున్నారు.
బోని కపూర్ ను నాలుగు గంటల పాటు.....
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు. వీడియో కెమెరాతో బోనీ కపూర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా విచారించారు. వీరితో పాటు శ్రీదేవిని తీసుకెళ్లిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని కూడా దుబాయ్ పోలీసులు విచారించారు. మొత్తం మీద పోస్ట్ మార్టం నివేదిక మాత్రం శ్రీదేవి మృతికి గల కారణాలను వివరించింది. ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి శ్రీదేవి ఊపిరాడక మరణించిందని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. శ్రేదేవి మృతదేహాన్ని ఈరోజు రాత్రికి ముంబయికి తీసుకురానున్నారు. రేపు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
- Tags
- శ్రీదేవి

