షరతులతోనే అమరావతి నిర్మాణం

అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనుమతి లభించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యనల్ ఇందుకు అనుమతించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలను అమలు చేయాలని సూచించింది. దాదాపు 22 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితం తీర్పు నిచ్చింది. కొండవీటి వాగు మార్చినప్పటికీ ముంపు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం సూపర్ వైజరీ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై రాజధాని నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడాలని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్, పర్యవేక్షణకు రెండు కమిటీలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించనుంది.
కమిటీల పర్యవేక్షణలోనే....
కొండవీటి వాగు ప్రవాహాన్ని మార్గాన్ని మార్చొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. కొండవీటి వాగు లోతు, వెడల్పు చేసేందుకు అనుమతిచ్చింది. అయితే నేషనల్ గ్రీన్న ట్రిబ్యునల్ నియమించిన కమిటీ ఎప్పటికప్పుడు రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. అమరావతిలో రాజధాని నిర్మాణంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. మొత్తం నాలుగు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై 22 నెలల క్రితం దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన అనంతరం ఈరోజు తుది తీర్పునిచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి డిజైన్లను కూడా ఖరారు చేసింది. నార్మన్ పోస్టర్ సంస్థ కు డిజైన్ల బాధ్యతను అప్పగించింది. ఈరోజే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై దీనిపై చర్చలు జరిపారు. పచ్చదనాన్ని పరిరక్షిస్తూనే.. అభివృద్ధి చేయాలని సూచించింది. రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో టీడీపీ నేతల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
- Tags
- అమరావతి

