షమీ కి బాసటగా నిలిచిన కపిల్ దేవ్

భారత స్టార్ క్రికెటర్ షమీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. షమిపై ఆయన భార్య పెట్టిన కేసుల్లో గృహ హింస కేసు తప్ప మిగిలినవి ఏవి నిలిచే పరిస్థితి వుండకపోవొచ్చని న్యాయనిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు పలు కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. పెళ్ళాం పెట్టిన కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన షమీకి ఇప్పుడు ఒకనాటి మేటి క్రికెటర్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ అండగా నిలిచాడు.
ఫిక్సింగ్ చేసే ఛాన్స్ లేదు ...
తనకు తెలిసి షమి అలాంటి వాడు కాదన్నది కపిల్ స్టేట్ మెంట్. కపిల్ కి కూడా ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయి అందుకే షమి భార్య కావాలనే కుటుంబ వివాదాల నేపథ్యంలో భర్తను ఇరికిస్తుందేమో అన్నది కపిల్ కి వచ్చిన సందేహం. ముఖ్యంగా మ్యాచ్ లను షమి ఫిక్స్ చేసేవాడని ఆమె చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి డేగ కన్ను వేసింది. అందరికన్నా ముందు ఐసిసి కి ఆ తరువాత బిసిసిఐ కి తెలిసిపోతుంది. అలాంటప్పుడు షమి పై అతని భార్య చేసిన ఆరోపణల్లో పసలేదన్నది పలువురు వ్యక్తం చేస్తున్నారు కూడా.
షమి భార్యపై మరికొన్ని సందేహాలు ...
తనను ఐదేళ్లుగా షమి వేధిస్తున్నాడని ఆయన భార్య హాసన్ జహీనా ఫిర్యాదు చేసింది. పెళ్లయిన తరువాత తనను కొట్టేవాడని, చంపేస్తా అంటూ బెదిరించేవాడని, మ్యాచ్ లు ఫిక్స్ చేసే వాడని మానసికంగా, శారీరకంగా హింసించేవాడని ఆమె ఆరోపణలు. వాస్తవానికి మొదటి భర్తను వీడి వచ్చిన ఇద్దరు పిల్లల జహీనా కు నాలుగేళ్ల క్రితమే షమితో వివాహం జరిగింది. ఆమె ఐదేళ్లు నుంచి హింస అంటూ పాకిస్థాన్ అమ్మాయిలు ఇతర అమ్మాయిలతో సంబంధాలు అంటూ అన్ని రకాల కేసులు పెట్టేసింది. ఇప్పుడు పోలీసులు సాగిస్తున్న విచారణలో వీరిద్దరి నడుమ ఏర్పడిన మనస్పర్థలే ఇంతటి వివాదానికి కారణమని తేలుతున్నట్లు తెలుస్తుంది. దాంతో గృహ హింస కేసు మాత్రమే నిలబడేలా కనిపిస్తుండటంతో షమి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
- Tags
- షమి
