శ్రీవారి మెట్ల వద్ద భారీ విధ్వంసానికి కుట్ర చేసింది ఎవరు ...?

ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి కేంద్రంగా విధ్వంస రచనకు ఎర్రచందనం పై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ భగ్నం చేసింది. ఒక భారీ విస్ఫోటనకు అవసరమైన ఎలట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం తో తీవ్ర కలకలం రేగుతుంది. ఈ విధ్వంసానికి పధక రచన చేసింది ఎవరు ? తిరుమల ఆలయాన్ని టార్గెట్ చేశారా లేక ఆ ప్రాంతంలో సంచరించే విఐపి లను టార్గెట్ చేశారా అన్నది దర్యాప్తులో తేలాలిసివుంది.
ఎర్రచందనం స్మగ్లర్ల వేటకు వెళితే ...
ఎర్రచందనం పై ఏర్పాటైన స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిఐజి కాంతారావు ఆధ్వర్యంలో చాలా కాలంగా శేషాచలం అడవులను జల్లెడ పడుతూ స్మగ్లర్లకు దడపుట్టిస్తున్నారు. అనేక ఆపరేషన్ల ద్వారా కాంతారావు టీం అత్యంత విలువైన అటవీసంపదను కాపాడటమే కాదు కరడుగట్టిన స్మగ్లర్లను కడతేర్చింది. ఈనేపధ్యలో రొటీన్ గా శేషాచలం అటవీప్రాంతంలో శ్రీవారి మెట్టు వద్ద స్పెషల్ పార్టీ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక వదిలి పెట్టిన బ్యాగ్ కనిపించింది. దానిని పరిశీలించిన స్పెషల్ టీం అది చూసి అవాక్కయింది. వెంటనే బాంబు తనిఖీ నిపుణులను పిలిపించి పరిశీలిస్తే అతి భారీ పేలుడుకు పధక రచన చేస్తున్నట్లు తేలింది. కెపాసిటర్, కండక్టర్లు , ఒక ఖాళీ సెల్ ఫోన్ ,రెసిస్టర్స్ వాక్ మెన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని తమిళనాడులోని తిరుచ్చి లో కొనుగోలు చేసినట్లు తేలింది. బ్లాస్టింగ్ చేసేందుకు ఉపయోగపడే ఇవి లభించడంతో పేలుడు పదార్ధాలు దగ్గరలో ఎక్కడైనా ఉన్నాయా లేక ఇవి అమర్చాకా వాటిని తరలించాలని కుట్ర దారులు ప్రయత్నమా అన్నది తేలాలి.
తీవ్రవాదుల టార్గెట్ ఎవరు ...?
శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి తిరుమల చేరుకునే మెట్ల మార్గం లో అంతగా తనిఖీలు వుండవు. ఈ మార్గం నుంచి తిరుమల శ్రీవారి కొండపైకి ఒక్కొక్కటిగా పేలుడు సామగ్రి తరలించే కుట్ర జరిగినట్లు తొలుత దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. అదికాకపోతే ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ను టార్గెట్ కోసం ఏర్పాటు చేస్తున్నారా అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. మరోకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విఐపి లు టార్గెట్ గా కుట్ర జరుగుతుందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లె సంక్రాంతి పండుగ కు వెళ్లి వచ్చారు. గతంలో అలిపిరిలో ఆయన పై అలిపిరిలో నక్సల్స్ దాడికి ప్రయత్నం చేసినప్పుడు తృటిలో తప్పించుకున్నారు. తాజాగా ఈ దాడికి సూత్రధారులు ఎవరు ? ఎవరిని టార్గెట్ చేశారు ? తిరుమల లో భద్రత ఏమేరకు వుంది అన్నది దర్యాప్తులో వెలుగు చూడనుంది.

