శ్రీదేవి మృతి కేసులో ఊహించని ట్బిస్టులు

అందాల నటి శ్రీదేవి మృతి కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. మరోసారి శ్రీదేవి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని దుబాయ్ లోని ప్రాసిక్యూషన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. బోనీ కపూర్ ను దుబాయ్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. బోనీ కపూర్ పాస్ పోర్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడుతుంది. విచారణ సందర్భంగా బోనీ కపూర్ వాదనతో ప్రాసిక్యూషన్ సంతృప్తి పడలేదని తెలుస్తోంది. క్లియరెన్స్ సర్టిఫికేట్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం చేయకపోవడంతో రీ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశముందంటున్నారు. అటాప్సీ రిపోర్ట్ పై కూడా ప్రాసిక్యూషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోనీ కపూర్ ను మరోసారి విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీదేవి పేరుపై కోట్ల రూపాయల బీమా ఉన్నట్లు తెలియడంతో ఆ సొమ్ముకోసమే ఇది జరిగిందా? అన్న అనుమానాలను కూడా దుబాయ్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి హెల్త్ కార్డులు కావాలని ప్రాసిక్యూషన్ కోరింది. బోనీ కపూర్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని దుబాయ్ పత్రికల కథనంగా తెలుస్తోంది. శ్రీదేవి మరణానికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ కు తరలించే విషయంలో ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. దుబాయ్ లో భారత్ రాయబారి కూడా చేతులెత్తేశారు.
- Tags
- శ్రీదేవి

