Fri Mar 27 2026 22:31:23 GMT+0530 (India Standard Time)
వైసీపీలోకి రత్తయ్య

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని, అయితే వైసీపీ అధినేత జగన్ ఆదేశం మేరకు తాను పోటీ చేసేదీ లేనిదీ తెలుస్తుందన్నారు. ఆయన చిత్తూరు జిల్లాలోని మంగుంట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రత్తయ్య త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. రత్తయ్య రాకతో వైసీపీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ ఏ పార్టీలో లేరు. తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్న రత్తయ్య వైసీపీని ఎంచుకున్నారు.
- Tags
- వైసీపీ
Next Story

