Mon Apr 06 2026 03:56:48 GMT+0530 (India Standard Time)
వైసీపీని నేను ఎందుకు విమర్శిస్తున్నానంటే....?

ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాల్సిన తరుణంలో ఆ పనిచేయలేకపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు కలిసిన సందర్భంలో పవన్ ఈ వ్యాఖ్యలను చేశారు. వైసీపీనే ఎందుకు విమర్శిస్తున్నారంటూ తనను కొందరు నిలదీస్తున్నారని, 28వేల మంది కార్మికుల సమస్యను ప్రతిపక్షం అసెంబ్లీలో ఎందుకు తీసుకెళ్లలేకపోయిందన్నారు. అసెంబ్లీలో బలంగా వాదించాల్సిన తరుణంలో ప్రతిపక్షం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలో... ప్రతిపక్షం కూడా అంతే బాధ్యత వహించాలన్నారు. సీఎం అయితే సమస్య పరిష్కరిస్తానంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
- Tags
- పవన్ వైసీపీ
Next Story

