Fri Mar 27 2026 03:47:04 GMT+0530 (India Standard Time)
వైసీపీకి జేసీ సవాల్

రాజీనామాకు తాను సిద్ధమని, వైసీపీ ఎంపీలు రాజీనామాలుచేసి ముందుకు రావాలని అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాకు ముందుకు రావాలన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తాను కూడా వెంటనే రాజీనామా చేస్తామని చెప్పారు. టీడీపీ, బీజేపీ ల ట్రిపుల్ తలాక్ పూర్తయిపోయిందని చెప్పారు. ఇక పిల్లల భవిష్యత్ గురించే ఆలోచించాలన్నారు. కేసీఆర్ పెట్టే థర్డ్ ఫ్రంట్ లో చంద్రబాబుకు వెళ్లాల్సిన అవసరం లేదని జేసీ అభిప్రాయపడ్డారు. ఇక ప్రధాని మోడీని కలిసి ప్రయోజనం లేదన్నారు.
- Tags
- జేసీ
Next Story

