Wed Feb 04 2026 07:29:00 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ వెంట 20 పార్టీలు

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికితాము పూర్తి మద్దతిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. తాము వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వనున్నటు చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ వెంట ఉన్న 20 పార్టీలూ అవిశ్వాసానికి మద్దతిస్తాయని, ఈ మేరకు లోక్ సభలోని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా ఆదేశాలు జారీ చేశారని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రఘువీరారెడ్డి వెల్లడించారు.
- Tags
- వైసీపీ
Next Story
