Mon Apr 06 2026 23:42:26 GMT+0530 (India Standard Time)
వైరల్ వీడియోపై గిడ్డి ఈశ్వరి స్పందన ఇదే...

వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి మారిన గిడ్డి ఈశ్వరి వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఆమె తనకు ఎప్పుడుమంత్రి వర్గ విస్తరణ జరిగితే అప్పుడు మంత్రి పదవి వస్తుందని, లేకుంటే ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తుందని ఆమెచేసిన వ్యాఖ్యల వీడియో బయట పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించారు. తనను వైసీపీ నేతలు మానసికంగా వేధిస్తున్నారన్నారు. జగన్ సీఎం కావాలనుకున్నప్పుడు... తాను మంత్రి అవ్వాలనుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. తాను జగన్ పై ఎస్సీఎస్టీ వేధింపుల కేసును పెడతానని ప్రశ్నించారు.తాను ఇన్నాళ్లూ పార్టీ కోసం చేసిన త్యాగాలు జగన్ కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
- Tags
- గిడ్డి ఈశ్వరి
Next Story

