వైఎస్ బతికున్నంత వరకూ నన్ను....?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జాతీయ మీడియా దృష్టికి వెళుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకున్న తర్వాత ఏపీ రాజకీయాలను జాతీయ మీడియా నిశితంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రపై కూడా జాతీయ మీడియా కన్నేసింది. పాదయాత్ర కు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారా? లేక వైసీపీ శ్రేణులే యాత్రలో ఉంటున్నారా? ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్న విషయాలను జాతీయ మీడియా ఆరా తీస్తోంది.
జాతీయ స్థాయిలో జగన్ పాదయాత్ర....
వైసీపీ అధినేత జగన్ తో ఇంటర్వ్యూలు చేస్తూ యాత్రను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆన్ రియాలిటీ చెక్ కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాస్ జైన్ సోమవారం జగన్ ను పాదయాత్రలో కలుసుకున్నారు. వివిధ అంశాలపై జగన్ అభిప్రాయాలను తీసుకున్నారు. అరుణ్ జైట్లీ పాత పాటే పాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు.
బీజేపీతో సంబంధాల్లేవ్.....
తనకు బీజేపీతో ఎటువంటి సంబంధాలు లేవన్న జగన్, అవే ఉంటే తాము బీజేపీపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీతో చేతులు కలిపి తనపై అక్రమ కేసులు బనాయించారని జగన్ ఆరోపించారు. వైఎస్ బతికున్నంతకాలం తనను గౌరవంగా చూశారని, ఆయన మరణించిన తర్వాత తనను టార్గెట్ చేశారని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం ఎంతవరకూ సమర్థనీయమన్నారు జగన్. మొత్తం మీద జాతీయ స్థాయిలో జగన్ పాదయాత్ర చర్చనీయాంశమైంది.
- Tags
- జగన్ పాదయాత్ర
