Mon Mar 30 2026 21:06:48 GMT+0530 (India Standard Time)
వెయ్యి కిలోమీటర్లు దాటిన జగన్...!

వైఎస్ జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురానికి జగన్ చేరుకున్నారు. నెల్లూరు జిల్లాల సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన పైలాన్ ను జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ కు సైదాపురం గ్రామస్థులు పెద్దయెత్తున స్వాగతం పలికారు. జగన్ వెంట వేలాదిమంది పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేసుకోవడంతో ఈరోజు రాష్ట్రమంతటా వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు చేపట్టాయి.
- Tags
- జగన్
Next Story

