వీకెండ్ గ్యాంగ్... వీరు వేలుపెడితే కోట్లు ఫట్...!

నార్త్ ఇండియాలో స్టార్ట్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఎండ్ చేస్తారు. ఎక్కడా కూడా పది నిమిషాలకంటే ఎక్కువగా వుండరు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటారు. దొంగతనం చేయాలని అనుకున్న ఇంటిని జీపిఎస్ ద్వారా ఎంచుకుని మరి చోరీ చేస్తారు. చిన్నా చితకా ఇంటికి వీరు వెళ్లరు. కనీసం ఒక పెద్ద ఇంటినే వీరు దొచుకుంటారు. పది రాష్ట్రాల్లో దొపిడిలకు పాల్పడుతున్న వీకెండ్ దొంగలను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి....
మధ్య ప్రదేశ్ కు చెందిన శైలెంద్ర విశ్వకర్మ.. ఇతను ఒక కారు డ్రైవర్. ఇతను ఎప్పడో కారు డ్రైవర్ గా పని చేసిన ఇతను ఇప్పడు ఒక ఘరానా దొంగగా మారాడు. మధ్య ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని ఇతను వాడుతున్నాడు. క్రికెట్ ఆడటం ఇతనికి ఇష్టం. లావిష్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే అమ్మాయిలతో గడపటం ఇష్టం. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఇతని అలవాటుకు జీతం సరిపోలేదు. దీంతో తన లావిష్ లైఫ్ కోసం దొంగతనాలు చేయాలని అనుకున్నాడు. దీంతో ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు. ఇందులో ఒక అమ్మాయిని కూడా పెట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యులు గల ఈ గ్యాంగ్ వీకెండ్ లో చోరీలకు బయలు దేరుతారు. ముఖ్యంగా నెలలో మూడో వారం లోని వీకెండ్ లోనే చొరీలు చేస్తారు. జీపిఎస్ ద్వారా చోరీ చేసే ప్రాంతాలను ముందుగానే ఎంచుకుంటారు. రోడ్డు మార్గంలో ఈ గ్యాంగ్ మధ్య ప్రదేశ్ నుంచి హైదరబాద్ వస్తుంది. అది కూడా లారీలు.. షేరింగ్ ఆటోల ద్వారా హైదరబాద్ శివారు ప్రాంతాల వరకు చేరుకుంటారు.అక్కడికి వచ్చిన తరువాత జీపిఎస్ ను ఆన్ చేసుకుని ఖరీదైన ప్రాంతాలను ఎంచుకుంటారు. ఆ ఏరియాలకు డైరెక్ట్‌గా తన గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళతారు. ఏ ఇంటికైతే తాళాం వేసి వుంటుందొ అక్కడి ఈ గ్యాంగ్ ఇద్దరేసి చొప్పున మాటు వేస్తారు. ఇందులో ఒక అమ్మాయి తాను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పి ఏరియాలో తిరుగుతుంది. ఇల్లు అద్దె కోసం తాము తిరుగుతున్నామని చెబుతుంటారు. ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే ఆ ఇంటిలోకి ఈ గ్యాంగ్ ఎంటర్ అవుతుంది.
నాలుగు రాష్ట్రాలు... 8చోరీలు...
ఇంట్లోకి వెళ్లిన పది నిమిషాల్లో చోరీ చేసుకుని బయట పడతారు. ముఖ్యంగా గొల్డ్, క్యాష్ ను మాత్రమే తీసుకుంటారు. ఇలా ఒకటి రెండు ఇళ్లను చొరీ చేస్తారు. వెంటనే హైదరబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటారు.అక్కడ రెండు దొంగతనాలు చేశారు. తరువాత చైన్నయ్ వెళ్లి అక్కడ రెండు చొరీలు చేశారు. తరువాత కొచ్చి.. తిరువనంతపురం. బెంగళూరు.. కర్నూలు... తిరిగి హైదరబాద్ లో చివరి దొంగతనం చేసి మధ్యప్రదేశ్ కు వెళ్లిపోతారు. వచ్చిన ప్రతిసారీ కనీసం ఐదు కేజీల బంగారంతో పాటుగా యాభై లక్షలకు తక్కువ కాకుండా చోరీ చేసుకుని పోతారు. ఇలా ఇప్పటికి వందల సంఖ్యలో చోరీ లు చేశారు.. తెలంగాణ. ఆంధ్ర, గుజరాత్. మధ్యప్రదేశ్. కర్నాటక, కేరళ లో వీరు పెద్ద సంఖ్యలో చోరీ చేశారు. హైదరబాద్ లో ఒక ఎడిటర్ ఇంటిలో చోరీ కి పాల్పడి పెద్ద మొత్తంలో ఎత్తుకుని పోయారు. ఈ కేసును ఫాలో అప్ చేస్తుంటే పోలీసులకు ఈ ముఠా చిక్కింది. ఇప్పటి వరకు హైదరబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోనే యాభైకిపైగా చోరీలు చేశారని పోలీసలు చెప్పారు.
బంగారాన్ని కరిగించేందుకు...
అయితే రెండు రాష్ట్రాల్లో జరిగిన చోరీల గురించి తమకు సమాచారం వుందని..కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని ఈ ముఠా దోచుకుందని, అందులో ఇప్పటి వరకూ కొంత మాత్రమే తాము రికవరీ చేయగలిగామని పోలీసులు చెప్పారు. ఇంకా ఇద్దరు పరారీలో వున్నారని, వారి దగ్గర కిలోల కొద్దీ బంగారం వుంటుందని తాము భావిస్తున్నామన్నారు పోలీసులు. ఇదిలా వుంటే చోరీ చేసిన బంగారాన్ని కరిగించేందుకు వీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. బంగారాన్ని కరిగించేందుకు ఒక ప్రత్యేక మిషన్ కూడా కొనుగోలు చేశారు. ఇలా కరిగించిన బంగారాన్ని గొల్డ్ షాపు లో అమ్మి సొమ్ముచేసుకుంటారు. వచ్చిన డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ లతో పాటుగా లావిష్ లైప్ ను వీరు ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
- Tags
- వీకెండ్ గ్యాంగ్

