Mon Apr 06 2026 09:23:36 GMT+0530 (India Standard Time)
విశాఖకు..పవన్ ...ఎందుకంటే...?

పవన్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నాడు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై కూడా దృష్టి పెడుతున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ప్రయివేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. మరో వైపు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్ కుటుంబం విజయనగరం జిల్లాకు చెందినది. ఆ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించే అవకాశం ఉంది. అలాగే డీసీఐ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పవన్ పాల్గొననున్నారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

