విమానాల్లో వస్తాడు... ఊడ్చేసి పోతాడు

పార్క్ హయత్ హోటల్ కేసు ను పోలీసులు ఛేదించారు. స్టార్ హోటల్స్ నే జయేష్ టార్గెట్ చేసుకుంటాడు. మొత్తం 13 రాష్ట్రాల్లో స్టార్ హోటల్స్ లోనే జయేష్ చోరీచేసినట్లు పోలీసులు కనుగొన్నారు. గుజరాత్ కు చెందిన జయేష్ స్టార్ హోటల్స్ నే తన చోరీకి లక్ష్యంగా ఎంచుకుంటాడు. స్టార్ హోటల్స్ దిగుతాడు. అక్కడ పార్టీలు, ఫంక్షన్లు ఉన్నాయని ముందుగా తెలుసుకుని అందులో దిగుతాడు. అందరూ పార్టీలో మునిగిపోయి ఉన్న సమయంలో హస్తలాఘవం ప్రదర్శిస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా గదిని ఖాళీ చేసి పోతాడు.
కొత్తగా పెళ్లైన జంటలనే....
జయేష్ ముందు కొత్తగా పెళ్లైన జంటలనే టార్గెట్ చేసి చోరీ చేస్తాడు. ఇప్పటి వరరకూ జయేష్ పై దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 30 కేసులు నమోదయి ఉన్నాయి. 2003లోనే జయేష్ ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. 19 కేసులకు సంబంధించి జయేష్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. హైదరాబాద్ లోని పలు స్టార్ హోటల్స్ లో చోరీలు చేశాడు. బంజారాహిల్స్ లోని హోటల్ పార్క్ హయత్, అబిడ్స్ లోని మెర్క్యూర్ హోటల్, ఎస్ ఆర్ నగర్ లోని మ్యారిగోల్డ్ హోటల్స్ లో దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
స్టార్ హోటల్స్ నే....
ముందుగా స్టార్ హోటల్స్ ను గుర్తిస్తాడు. అందులో కొత్తగా పెళ్లైన జంటను టార్గెట్ చేస్తాడు. హోటల్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి లోనికి ప్రవేశిస్తాడు. కొత్తగా పెళ్లయిన దంపతుల వద్ద ఉండే వజ్రాభరణాలను దోచేస్తాడు. విందులు, వివాహ వేడుకలు ఆ హోటల్ లో ఉన్నాయా? లేవన్నది తెలుసుకుంటాడు. అవి ఉంటేనే అందులోకి వస్తాడు. ఆభరణాలను ధరించిన వారితో పరిచయం పెంచుకుంటాడు. మాటలు కలుపుతాడు. సిబ్బంది చూసేలా ఆ జంటలతో చనువుగా ప్రవర్తిస్తాడు. ఆ జంట హోటల్ నుంచి బయటకు వెళ్లిందని తెలుసుకుని వెంటనే పనిని ప్రారంభిస్తాడు. సిబ్బందితో తన గది తాళం చెవులు పోయాయని చెప్పి నమ్మబలుకుతాడు. మరో తాళం చెవితో ఆ గది తెరిచి ఆభరణాలను దోచుకెళతాడు. ఇలా పదిహేడు చోట్ల దొంగతనాలు చేశాడు జయేష్. ముంబయి, చెన్నై, బెంగళూరు, ఆగ్రా, డోంగ్రీ పోలీసులు గతంలో జయేష్ ను అరెస్ట్ చేశారు. ఒకసారి ఉత్తరాదిని ఎంచుకుంటే మరోసారి దక్షిణాదిని ఎంచుకుంటాడు. విమానాల్లో వచ్చి మరీ దొంగతనాలు చేసి వెళుతుంటాడు. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులకు జయేష్ చిక్కాడు. ఇదండీ ఈ నేరగాడి ఘన చరిత్ర.
- Tags
- జయేష్
