Wed Feb 04 2026 18:01:50 GMT+0000 (Coordinated Universal Time)
విమానం కుప్పకూలింది: 20 మంది మృతి

నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది వరకూ మృతి చెందినట్లు తెలుస్తోంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. విమానం కూలి పోవడంతో పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది.
- Tags
- విమాన ్రమాదం
Next Story
