Fri Dec 05 2025 19:04:57 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయిపై విరుచుకుపడ్డ లోకేష్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి తాజాగా లండన్ లో చంద్రబాబు విజయ్ మాల్యాను కలిశారని, విజయమాల్యా నుంచి 150 కోట్ల పార్టీ ఫండ్ ను సేకరించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ ఫైరయ్యారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆరోపణలు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. తాము ఆరోపణలు చేస్తే నిరూపిస్తామని, అలాగే విజయసాయి రెడ్డి కూడా తన ఆరోపణలను నిరూపించాలన్నారు. పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని లోకేష్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని లోకేష్ ఆరోపించారు.
Next Story
