వావ్... పుజారా...!

టీమిండియా క్రికెటరో్ ఛతేశ్వర్ పుజారా అరుదైన రికార్డును సొంతం చేుకున్నారు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పుజారా వరుసగా ఐదోరోజు బ్యాటింగ్ చేసి రికార్డును నెలకొల్పాడు. భారత మూడో క్రికెటర్ గా పుజారా ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. శ్రీలంక - ఇండియా టెస్ట్ మ్యాచ్ కోల్ కత్తాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలిటెస్ట్ వర్షం కారణంగా తొలిరోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. భారత్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో పుజారా క్రీజ్ లోకి అడుగుపెట్టాడు. తొలిరోజు 8 పరుగులు చేసిన పుజారా రెండో రోజు 47 పరుగులు చేశారు. మూడోరోజు యాభై పరుగులు చేసిన పుజారా 52 పరుగుల వద్ద అవట్ అయ్యారు.
అరుదైన రికార్డు....
తర్వాత మొదలైన శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగోరోజు మధ్యాహ్నానికే జట్టంతా అవుటయింది. దీంతో నాలుగో రోజు ధావన్ 92 పరుగుల వద్ద అవుట్ కావడంతో పుజారా బ్యాటింగ్ కు వచ్చారు. ఐదోరోజు కూడా పుజారా బ్యాటింగ్ చేసి 22 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అయితే వరుసగా ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన పుజారా అరుదైన రికార్డును నెలకొల్పారు. గతంలో భారత క్రికెటర్లు ఎంఎల్ జయసింహ, రవిశాస్త్రిల పేరు మీదనే ఈ రికార్డు ఉండేది. వీరితో పాటు పుజారా కూడా చేరిపోయారు. ఆల్ ది బెస్ట్ పుజారా.
- Tags
- పుజారా

