వావ్... జగన్... మీలో ఎంత మార్పు?

జగన్ తీరులో మార్పు కన్పిస్తోంది. యువభేరిలో జగన్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో వైసీపీకి భంగపాటు ఎదురయింది. నంద్యాలలో ఓటమికి కారణం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలే నని కొందరు ఇప్పటికీ భావిస్తున్నారు. జగన్ భాషను మార్చుకోవాలని సూచించారు.
అనవసర వ్యాఖ్యలు చేయకుండా......
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు జగన్ లో మార్పు తెచ్చినట్లే కన్పిస్తున్నాయి. కొద్దిసేపటిక్రితం అనంతపురంలో జరిగిన యువభేరిలో చంద్రబాబు పై జగన్ వ్యక్తిగత దూషణలకు దిగలేదు. చంద్రబాబు అని ఉచ్ఛరించినప్పుడల్లా జగన్ చంద్రబాబును ఉద్దేశించి గారూ అని పేర్కొనడం గమనార్హం. జగన్ తన ప్రసగంలో ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబుపై అనవసర ఆరోపణలు చేయలేదు. జగన్ కేవలం ప్రత్యేక హోదా, చంద్రాబాబు ఇచ్చిన హామీలు, దానిని అమలు పర్చకపోవడంపైనే మాట్లాడారు. తన ప్రసంగంలో చంద్రబాబుపై అనవసర వ్యాఖ్యలు చేయకపోవడం గమనించదగ్గ విషయం. మొత్తం మీద జగన్ లో వచ్చిన ఈ మార్పుకు వైసీపీ నేతలు ఆనందపడిపోతున్నారు.
- Tags
- జగన్

