వారి గోతిలో వారే పడ్డారు.....!

భారత్ బలహీనత సొమ్ము చేసుకుందామని భావించిన సఫారీలకు చుక్కెదురైంది. జోహెన్స్ బర్గ్ లో నిర్వహించిన మూడో టెస్ట్ లో దారుణమైన బౌన్సీ పిచ్ తయారు చేయించి టీం ఇండియా ను వైట్ వాష్ తో పంపాలని దక్షిణాఫ్రికా భావించింది. అయితే భారత్ తొలుత బ్యాటింగ్ చేయడం తో చివరి రోజుల్లో అత్యంత కఠినంగా పిచ్ మారడంతో సఫారీల ప్లాన్ ఎదురు తిరిగి ఓటమి చవి చుడాలిసి వచ్చింది. తోలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల తేడాతో వెనుకబడ్డ భారత బ్యాట్స్ మెన్, రెండో ఇన్నింగ్స్ లో పట్టుదలగా ఆడి ఆతిధ్య జట్టుకు సవాల్ విసిరారు. ఆట మూడో రోజే పిచ్ లో వచ్చిన తేడాతో ఆట జరుగుతుందో లేదో అనే స్థాయిలో అంతా ఉత్కంఠ గా ఎదురు చూశారు.
అలా జరిగింది ...
భారత ఇన్నింగ్స్ ముగిసింది. సఫారీల బ్యాటింగ్ వంతు వచ్చింది. ఇక విజయానికి ఊరించే లక్ష్యం ఛేదించి పనిలో చతికిల పడింది దక్షిణాఫ్రికా. భయంకరమైన పిచ్ పై మూడు కీలక వికెట్లు పడేవరకు విజయం వైపు దూసుపోతున్నట్లే కనిపించిన ఆతిధ్య జట్టు ఆమ్లా అవుట్ కాగానే మిగిలిన బ్యాట్స్ మెన్ వరుసగా క్యూలైన్ దారి పట్టి ఆ రాష్ట్ర అభిమానులను నిరాశ పరిచారు. దాంతో 63 పరుగుల తేడాతో టీం ఇండియా సంచలన విజయం సాధించి సిరీస్ ను 2-1 తో ముగించింది. భారత్ తొలి, రెండో ఇన్నింగ్స్ లలో 187 /247 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 194/177 పరుగులు చేసింది. ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఫిన్ లాండర్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది. పిచ్ తో మ్యాచ్ తమవైపు తిప్పుకుందామనుకున్న సఫారీలకు మాత్రం టీం ఇండియా సమిష్టిగా ఆడి గట్టి షాక్ ఇచ్చి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చింది.

