వామ్మో.. పార్థీ గ్యాంగ్ వచ్చేసింది...!

సినిమా తరహాలో దోచుకుంటారు. సినిమాల్లో చేసిన విధంగానే రెక్కీ చేస్తారు. దోపిడీ కోసం పక్కా ప్లాన్ చేస్తారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దోచుకుని పోతుంటారు. అడ్డం వచ్చిన వారిని ఖతం చేసి పారిపోతుంటారు. ఈ హంతక ముఠా కోసం నాలుగు రాష్ట్రాలు గాలిస్తున్నాయి. దేశంలోనే అతి పురాతన తెగల్లో ఒక్కటైన పార్థీ గ్యాంగ్ దోపిడీలపై స్పేషల్ స్టోరీ..
ఖాకీ సినిమా వీరిని చూసే....
ఇటివల విడుదలైన పలు సంచనాలు సృష్టించిన ఖాకీ సినిమా కు ఈ దొంగల స్టోరీనే స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఈ పార్థీ దొంగల జీవన విధానం మీదనే ఈ ఖాకీ సినిమా తీశారు. 1985 లో జరిగిన పలు దోపిడీలు, హత్యలకు ఈ గ్యాంగే కారణమని చెప్పవచ్చును. ఇప్పటి ఈ గ్యాంగ్ ఎన్ని దొంగతనాలు చేసినా కూడా శిక్షలు మాత్రం పడలేదు. దొంగతనాలకు పోయి అక్కడ అడ్డం వచ్చిన వారిని ఖతం చేయడంతో పాటుగా ఆడవారిని బలాత్కారం చేసి కిరాతకంగా చంపివేస్తుంటారు. అలాంటి గ్యాంగ్ ను పదిహేను సంవత్సరాల క్రితమే పోలీసులు మన రాష్ట్రంలోకి రాకుండా పూర్తిగా అడ్డుకున్నారు.
ఫ్యామిలీ...ఫ్యామిలీ మొత్తం....
అంతేగాకుండా ఈ గ్యాంగ్ లీడర్స్ పై పిడి యాక్ట్ పెట్టి కటకటాల వెనక్కి నెట్టారు. ఇన్నాళ్లూ మన రాష్ట్రంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ గ్యాంగ్ ఆచూకీ కనిపించకుండా పొయింది. ఇటీవల కాలంలో ఈ గ్యాంగ్ కార్యకలాపాలను మొదలు పెట్టింది. హైదరాబాద్ తో పాటుగా శివారు ప్రాంతాల జిల్లాల్లో మళ్లీ ఈ గ్యాంగ్ రెచ్చిపొయింది. ఇప్పటి వరకు హత్యలతో పాటుగా దోపిడిలతో హల్ చల్ చేసింది. పార్థీ గ్యాంగ్..ఇది దేశంలో అతి పురాతనమైన దొంగల గ్యాంగ్. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఒక తెగ వీళ్లది.. వీరి జీవన విధానం చాల డిఫరెంట్ గా వుంటుంది. వీరు ప్రధాన వృత్తి దొంగతనమే.. అయితే గ్రామాలకు చాల దూరంగా అడవిలో నివసించే వీరు .. తెగింపు చాల పెద్దది.. పురుషులు దొంగతనాలు చేస్తుంటే మహిళలు సహాయం చేస్తుంటారు. పిల్లలు చదువుకోరు .. పిల్లలు కూడా దొంగతనాలు చేస్తుంటారు. తాళాలు గట్టిగా వేసి వుంటే పిల్లలను కిటిల గుండా లోపలికి పంపిస్తారు. పిల్లలు పోయి లోపల గడియా తీస్తుంటారు. ఇలా కుటుంబాలకు కుటుంబాలు దొంగతనాలు చేస్తుంటారని పోలీసుల చెప్పారు.
హత్యలు...దోపిడీలు...
ఇటీవల కాలంలో రంగారెడ్డి, పరిగి, వికారాబాద్. కరీంనగర్. ఆదిలాబాద్. వరంగల్ , సైబారాబాద్,. రాచకొండ పరిధిలో ఇటివల కాలంలో పన్నెండు దోపిడీలు జరిగిన్నాయి.. ఒక దోపిడీలో ఇద్దరు మహిళల హత్య కూడా జరిగింది. దీనితో పాటుగా ఆరు చైన్ స్నాచింగ్ లు కూడా జరిగాయి.. దీంతో ఈ కేసులను మొత్తం చూడగా.. పార్థీ గ్యాంగ్ పని పోలీసులు ఒక నిర్థారణ కు వచ్చారు. ఈ గ్యాంగ్ కదలికలపైన పోలీసులు నిఘా పెట్టారు.. మహారాష్ట్ర నుంచి వచ్చి వికారాబాద్ మీదుగా వచ్చి దోపిడీలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే ఆరు బృందాలను రంగంలోకి దింపారు.. ఒక ఇంట్లో చొరీలు చేస్తుంటే పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. పార్ధీ గ్యాంగ్ కు చెందిన రాజేష్ పది మందితో ఒక గ్యాంగ్ ను తయారు చేశాడు. ఈ గ్యాంగ్ తో కలిసి వచ్చి హైదరబాద్ తో పాటుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీ లు చేసి పారిపోతున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్ లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా. మిగతా ఏడు మంది పరారీలో వున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇదిలా ఉంటే ఎప్పుడో తెర మరుగు అయిన పార్ధీ గ్యాంగ్ జాడలు ఇప్పడు మళ్లీ వెలుగు లోకి రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.. ఈ గ్యాంగ్ కదలిక కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నప్పటికి వెంటనే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
- Tags
- పార్థీ గ్యాంగ్

