వణికిస్తున్న వార్నర్

బాల్ ట్యాపరింగ్ లో అడ్డంగా బుక్ అయిన డేవిడ్ వార్నర్ త్వరలో చేయబోయే ప్రకటన ఇప్పటినుంచి క్రికెట్ ఆస్ట్రేలియా లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బోర్డు తనపై కర్కశంగా వ్యవహరించిన తీరు పై వార్నర్ లోలోన మదన పడుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ట్యాపరింగ్ పై బోర్డు శిక్ష విధించాక మీడియా ముందుకు వచ్చిన వార్నర్ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఇక తాను ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు జీవితంలో ఆడ లేనేమో అన్న అనుమానం వ్యక్తం చేశాడు. వార్నర్ పై జీవితకాలం, కెప్టెన్ స్మిత్ పై రెండేళ్లు బోర్డు వేటువేసిన సంగతి తెలిసిందే. ట్యాపరింగ్ లో ఎక్కువ బలై పోయింది వార్నర్. దాంతో అసలు ట్యాపరింగ్ లో ఎవరిపాత్ర ఎంతో చెప్పాలిసింది అందులో నిందితులైన వారే. ముఖ్యంగా వార్నర్. ఇప్పుడు వార్నర్ చేసిన వ్యాఖ్యల్లో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగియలేదనేది స్పష్టం చేస్తుంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వార్నర్ తిరుగుబాటే ముప్పు తెచ్చిందా ..?
డేవిడ్ వార్నర్ కొద్ది కాలం క్రితం క్రికెటర్ల కాంట్రాక్ట్ లలో వేతనాలు పెంచాలని టీం సభ్యులతో ఉద్యమం చేపట్టాడు. వార్నర్ పై అప్పటినుంచి క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ గా వుంది. ఇప్పుడు ట్యాపరింగ్ వ్యవహారం లో వార్నర్ బుక్ కావడంతో మొత్తం ఎపిసోడ్ విలన్ అతడే అనే రీతిలో జీవితకాల నిషేధం వంటి తీవ్ర చర్య తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వార్నర్ ను వేధిస్తుంది. అందుకే మొత్తం డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన బాగోతం బాహ్య ప్రపంచానికి విప్పేయాలన్న ఆలోచన వార్నర్ తీసుకున్నట్లు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే క్రికెట్ ఆస్ట్రేలియా మరో భారీ కుదుపునకు గురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
దుకాణం సర్దేసిన స్టీవ్ స్మిత్ ...
రెండేళ్లపాటు బోర్డు నిషేధం విధించడంతో ఆస్ట్రేలియా లో పనేమీ లేక స్టీవ్ స్మిత్ తట్టాబుట్టా సర్దేసి దుబాయి బయల్దేరాడు. ఇక భవిష్యత్తులో టీం ఆస్ట్రేలియా తరపున ఆడతానో లేదో అన్నది తేలేది కాదు. ఆస్ట్రేలియా లో ఇక ఉండి ప్రయోజనం లేదని భావించే దుబాయి లో డేరా వేద్దామని ప్లాన్ చేశాడు. ఇప్పుడు క్రికెట్ అకాడమీలకు ప్రపంచ హబ్ దుబాయి. మైకేల్ క్లార్క్, ఎంఎస్ ధోని వంటి వారు ఇప్పటికే దుబాయి అకాడమీలతో నాలుగు రూకలు బానే వెనకేస్తున్నారు. వారి బాటలోనే అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో అక్కడికి స్మిత్ బయల్దేరాడు అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం కొంతకాలం విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చేస్తాడని అంటున్నారు. ఒక్క మ్యాచ్ ఇప్పుడు వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి వారి జీవితాలనే మార్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా నే అతిపెద్ద కుదుపు కుదిపేసింది.
