Mon Apr 29 2024 08:04:28 GMT+0000 (Coordinated Universal Time)
వంశీ నోరు అదుపులో పెట్టుకో.....తెరాస
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై తెరాస నేతలు ధ్వజమెత్తారు. వంశీచందర్‌రెడ్డి కాగితపు పులిగా మారాలనుకుంటే రేవంత్‌రెడ్డికి పట్టిన గతే పడుతుందనివారు హెచ్చరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై వంశీచంద్‌రెడ్డి వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని తెరాస ఎమ్మెల్యే ఆలె వెంటేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో తెరాస నేతలు గువ్వల బాలరాజు, వెంకటేశ్వరరెడ్డి ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జూపల్లికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు కప్పిపుచ్చుకొనేందుకుమా నేతలపై ఆరోపణలు చేస్తే వూరుకొనేది లేదని హెచ్చరించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన జూపల్లి గురించి మాట్లాడే అర్హత వంశీకి లేదన్నారు.
- Tags
- వంశీచంద్ రెడ్డి
Next Story