Wed Mar 25 2026 11:08:36 GMT+0530 (India Standard Time)
లోకసభ వాయిదా పడిన తర్వాత సభలో

లోక్ సభలో అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ్యులు శాంతించాలని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే పదే పదే విజ్ఞప్తి చేశారు. అయితే లోక్ సభ వాయిదా పడిన తర్వాత అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బాహాబాహీకి ఇరు పార్టీకి చెందిన సభ్యులు దిగడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి రెండు పార్టీల నేతలకు సర్ది చెప్పారు. అన్నాడీఎంకే కావాలనే సభను అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గేపై కొందరు అన్నాడీఎంకే సభ్యులు దాడికి దిగేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అన్నాడీఎంకే సభ్యులను కాంగ్రెస్ నేత సోనియా వారించారు.
Next Story

