లాంఛనం పూర్తి : టైమ్స్ కిరీటం మోదీకే!

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కిరీటం మోదీనే వరించింది. ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు మోదీకి లభించినట్లయింది. ఆన్ లైన్ సర్వే ద్వారా నిర్వహించిన ఈ పోల్ లో మోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు లభించాయి. 4 వతేదీ పోల్ ముగిసిన సమయానికి వచ్చిన ఓటు శాతాలే.. అంతిమంగా ఫలితం అధికారికంగా వెల్లడించిన నాటికి ఉండడం విశేషం. బరాక్ ఒబామా, ట్రంప్ లాంటి వారినందరినీ తోసిరాజని మోదీ ఆ గుర్తింపును దక్కించుకున్నార.
4వ తేదీన పోల్ ముగిసినప్పటికే మోదీ ఎంపిక దాదాపు ఖరారు కాగా, ఇవాళ అధికారిక ప్రకటన కూడా పూర్తయింది.
మోదీ ఈ ఏడాదిలో అనేక సంచలనాలు నమోదు చేశారు. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రయిక్స్ దగ్గరినుంచి, భారత్ లో నల్లధనం కట్టడికి పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలు అనేకం ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ చర్యలన్నీ కూడా కేవలం భారతీయుల్ని మాత్రమే కాదు, యావత్తు ప్రపంచంలోని వారిని ఇటువైపు చూసేలా చేశాయి. మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడేందుకు కారణం అయ్యాయి. ఏతావతా.. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గుర్తింపు మోదీనే వరించింది.

