లక్ష్మీస్ వీరగంధం పై లక్ష్మి పార్వతి ఫైర్ ..

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి కౌంటర్ కోసమే లక్ష్మీస్ వీరగంధం సినిమా తీస్తున్నారా ? అవుననే అంటూ ఆందోళన మొదలు పెట్టారు లక్ష్మి పార్వతి. తన పై బురద చల్లేందుకే ఈ సినిమా అంటున్నారు ఆమె. మాహా నాయకుడు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని సైతం కించపరిచేలా ఈ వ్యవహారం కుట్ర పూరితంగా సాగుతుందని లక్ష్మీపార్వతి ఆరోపణ.
ఎన్టీఆర్ సమాధికి లక్ష్మి పార్వతి పాలాభిషేకం ...
ఎన్టీఆర్ ఘాట్ లో వున్న ఎన్టీ రామారావు సమాధి కి లక్ష్మీపార్వతి పాలాభిషేకం చేశారు. ఆయనను చనిపోయినా అవమానించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సినిమా తీయడం అంటే ఎన్టీఆర్ ను కించపరిచినట్లే అవుతుందన్నది లక్ష్మీపార్వతి అభిప్రాయం. ఈ సినిమా తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు లక్ష్మీపార్వతి.
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కేతిరెడ్డి ఆందోళన...
మరోవైపు ఈ చిత్రాన్ని తీస్తున్న కేతిరెడ్డి తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉన్నందున తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు రక్షణ కల్పించాలంటూ ఇరు రాష్ట్రాల డీజీపీలకు ఆయన లేఖ రాశారు. కృష్ణాజిల్లా నిమ్మకూరు లో లక్ష్మీస్ వీరగంధం సినిమా షూటింగ్ ప్రారంభం రోజునే అల్లరి మొదలైంది షూటింగ్ ను కొందరు అడ్డుకున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ల గోల ఎన్నికలకు ఏడాది ముందే తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తుంది.

