Sat Apr 11 2026 20:07:19 GMT+0530 (India Standard Time)
లండన్ కు జగన్

వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం లండన్ బయలుదేరి వెళ్లారు. తానుమూడు రోజులు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టునుంచి జగన్ అనుమతి తీసుకున్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా దాదాపు ఏడు నెలలు జగన్ పాదయాత్రలోనే ఉండే అవకాశముంది. జగన్ పెద్ద కుమార్తె హర్ష లండన్ లోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత కుమార్తె ను కలుసుకునేందుకు వీలుపడదని భావించిన జగన్ లండన్ బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల తర్వాత జగన్ తిరిగి హైదరాబాద్ చేరుకోనన్నారు.
- Tags
- లండన్ కు జగన్
Next Story

