Sat Apr 11 2026 03:43:58 GMT+0530 (India Standard Time)
రోజాను మంత్రి అయ్యన్న అంత మాట అనేశారే...!

వైసీపీ ఎమ్మెల్యే రోజా పై మంత్రి అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా తింగర బుచ్చి అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అయ్యన్న పాత్రుడు రోజా వ్యాఖ్యలను తాము పెద్దగా పట్టించుకోమన్నారు. రోజా పెద్ద తింగరబుచ్చి అని వ్యాఖ్యానించారు. టీవీ షోల్లో అసభ్యకరంగా మాట్లాడుతూ... సమాజం చూడలేని దుస్తులు వేసుకునే రోజా తమకు నీతులు చెప్పాల్సిన పనిలేదన్నారు. జగన్ పాదయాత్రకు తాము భయపడటం లేదని, ఆయన వెంట ఉండే 420లకే తాము బెదురుతున్నామని అయ్యన్న చమత్కరించారు.
- Tags
- రోజా అయ్యన్న
Next Story

