రోజా స్పీడ్ అయ్యారు ...

వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో భారీ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత మరో మినీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన నియోజక వర్గ పరిధిలోని గాలేరు నగరి ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ నగరి ఎమ్యెల్యే వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా పాదయాత్ర కు సంకల్పించారు . సుమారు 88 కిలోమీటర్ల దూరం ఆమె పాదయాత్ర చేయనున్నారు. రాబోయే ఎన్నికలను ఏ మాత్రం ఈజీగా తీసుకోకూడదని రోజా భావిస్తున్నారు. ఇప్పటికే రోజా నియోజకవర్గంలో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చేరువ అయ్యారు. తాజా గా సాగు, తాగు నీటి సమస్యకు వ్యతిరేకంగా రోజా చేపట్టనున్న యాత్ర చర్చనీయాంశం గా మారింది.
టిడిపి ఎత్తులు చిత్తు చేసేందుకైనా ....
రాబోయే ఎన్నికల్లో నగరిలో టిడిపి బలమైన సినీ గ్లామర్ వున్న అభ్యర్థిని నిలిపి రోజాను ఓడించాలన్న వ్యూహాలు ఇప్పటినుంచి అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులకు ఏ మాత్రం అందని వ్యూహాలు అమలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా రోజా ప్లాన్ చేస్తున్నారు. సినీ నటి వాణి విశ్వనాధ్ ద్వారా రోజా కు చెక్ పెట్టె ప్రయత్నాల్లో టిడిపి ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన వచ్చే ఎన్నికలు దగ్గర పడే నాటికి కానీ పసుపు పార్టీ అమలు చేయలేదు. ఈలోగా జనం సమస్యలపై పోరాట యోధురాలిగా ఎదగాలన్న లక్ష్యంతో రోజా దూసుకుపోతున్నారు. చూడాలి రోజా చేసే ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో.
- Tags
- రోజా

