రేవంత్ రాజనామా లేఖ ఎక్కడుంది?

రేవంత్ రాజీనామా ఎక్కడుంది? స్పీకర్ కు చేరలేదా? టీడీపీ అధినేత చంద్రబాబు వద్దనే ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా లేఖ ఉందా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇటీవల బెజవాడ వెళ్లి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియాకు కూడా ఆ లేఖను విడుదల చేశారు. అయితే ఆ లేఖ స్పీకర్ కార్యాలయానికి పంపకుండా పార్టీ అధినేత చంద్రబాబుకే రేవంత్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయం కూడా చంద్రబాబుకే రేవంత్ వదిలిసేనట్లు తెలిసింది.
చంద్రబాబుదే నిర్ణయం.....
అయితే రేవంత్ రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి ఇంతవరకూ చేరక పోవడంతో ఆ లేఖ చంద్రబాబు వద్దనే ఉంది. దీనిపై చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు జరిగే పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు రేవంత్ ఎమ్మెల్యే రాజీనామా లేఖపై ఒక నిర్ణయం తీసుకుంటారు. టీడీఎల్పీ నేతను కూడా ఈ సమావేశంలోనే నిర్ణయిస్తారు. రేవంత్ ఎటూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి రాజీనామా లేఖను చంద్రబాబు టీడీఎల్పీ లీడర్ ద్వారా స్పీకర్ కు పంపే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్పీకర్ కు రేవంత్ రాజీనామా లేఖ చేరిన తర్వాతనే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రేవంత్ తన గన్ మెన్లను కూడా ఉపసంహరించుకున్నారు. తనకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్ ను కూడా ఖాళీ చేశారు. రేవంత్ తన రాజీనామా ఆమోదానికి సిద్ధంగానే ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈరోజు తీసుకునే నిర్ణయంపైనే రేవంత్ రాజీనామా లేఖ స్పీకర్ కు చేరుతుందా? లేదా? అన్నది తేలుతుంది.
- Tags
- రేవంత్ రాజీనామా

