రేవంత్ కోసమే ఆ చట్టమా ....?

రాబోయేవి ఎన్నికలు. తామున్నది అధికార పార్టీలో. గతంలో ఉద్యమ పార్టీగా ప్రత్యర్థులపై ఎన్ని రకాల మాటలు అనాలో అన్ని అని ఇదేమి భాష అండి బాబు అని అన్ని పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో నెత్తి నోరు కొట్టుకునేలా చేసినవారిలో మార్పు వచ్చింది. దానికి కారణం తెలంగాణ వచ్చింది. అలాగే టిఆర్ ఎస్ కూడా గద్దెనెక్కింది. తమ నోటి దురుసు ఉద్యమ వ్యూహంలో భాగం ఇక అలాంటి మాటలు అనాలిసిన పనిలేదంది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రత్యర్ధులు ఊరుకుంటారా ? కేసీఆర్ ని ఆయన పార్టీని కుటుంబాన్ని ఒక తిట్టు కాకుండా తమ వ్యూహంలో భాగంగా తిట్టేస్తున్నారు. అదేమిటని అంటే ఆయన నేర్పిన విద్య అనే పరిస్థితి ఎదురైంది. దాంతో దీర్ఘంగా ఆలోచించిన టి సర్కార్ కొత్త ఆయుధం తయారు చేసింది.
శృతి మించితే కోర్టు తో సంబంధం లేకుండా జైలుకే ...
నోరు అదుపుతప్పి ఎవరు శృతి మించి మాట్లాడినా కోర్టు లకు పోయే పని లేని విధంగా టి సర్కార్ జీవోతేనే చట్టం చేసేసింది. ఈ ఫైల్ పై కేసీఆర్ సంతకం అయిపొయింది. దీనిప్రకారం అభ్యంతరకర భాష ఉపయోగించే ప్రతి ఒక్కరిని ఐ పిసి సెక్షన్ల కింద శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేయొచ్చు. ఈ అస్త్రాన్ని కేసీఆర్ సర్కార్ ఎలా అవసరమైతే అలా ఉపయోగించే వీలుంటుంది. అదుపుతప్పుతున్న సామాజిక మాధ్యమాల పై సైతం కొత్త అస్త్రం సర్కార్ కి బ్రహ్మాస్త్రం కానుంది.
కోదండరాం, మంద కృష్ణల కోసమేనా ...
తెలంగాణాలో మాటలను తూటాల్లా పేల్చే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, టిజెఎసి నేత కోదండరాం, ఎమ్మార్పీస్ అధ్యక్షులు మందా కృష్ణ మాదిగలు ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. వారి దాడికి ఒక్కోసారి అధికారపక్షం నుంచి కొత్త అభ్యంతరకర పదాలు వెతుక్కుని తిప్పికొట్టాలిసి వస్తుంది. ఇక ఇదంతా అయ్యే పనికాదని గుర్తించే టి సర్కార్ అన్నిటికి పనికొస్తుందని సంస్కారవంతమైన భాషనే ఉపయోగించాలని విమర్శలు ఆరోపణలు చేసినా ఆ లైన్ లోనే చేయాలని లేనిపక్షంలో జైలుకి పోతారనే తీరులో కొత్తగా తనదైన విధానంలో చెప్పడాన్ని ఇప్పుడు అంతా ఎలా తీసుకుంటారో చూడాలి.
- Tags
- రేవంత్ రెడ్డి

