రేవంత్ కు కట్ చేసేశారు...!

రేవంత్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు గాని ఆయన అధికారాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫారిన్ లోనే ఉండి కట్ చేసి పారేశారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయకుండా అధికారాలను తొలగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ చంద్రబాబుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. పొలిట్ బ్యూరో కు కూడా రేవంత్ ను పిలవకుండానే జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్ తనపై వస్తున్న వార్తలను ఖండించకుండా పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని, రేవంత్ పై చర్యలు తీసుకోకుంటే క్యాడర్ లో అయోయమం నెలకొంటుందని పొలిట్ బ్యూరో ఇటీవలే అభిప్రాయపడింది. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్ పై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని టీటీడీపీ నేతలు కూడా చెప్పారు.
రేవంత్ కు అధికారాలేమీ లేవ్.....
కాని రేవంత్ వ్యవహారం మరీ శృతిమించిందని భావించిన ఎల్ రమణ ఈరోజు చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. రేవంత్ రేపు శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని, తాము హాజరు కావాలా? వద్దా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని రమణ చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం రేవంత్ కు పార్టీ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతలను అప్పగించవద్దని, తాను టీడీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ అధికారాలన్నింటినీ కట్ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి సంబంధించిన సమావేశాలను రేవంత్ ను ఒక్క ఎమ్మెల్యేగానే పిలవాలి తప్ప రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించకుండా చూడాలని రమణను చంద్రబాబు ఆదేశించారు. తాను వచ్చిన తర్వాత రేవంత్ పై తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో టీడీఎల్పీ రేపు ఎలా జరగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరో వైపు రేవంత్ తాను టీడీఎల్పీ లీడర్ గా సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం విశేషం.
- Tags
- రేవంత్

