Wed Mar 25 2026 18:48:54 GMT+0530 (India Standard Time)
రేవంత్ ఓటు వేయలేదు

తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును రాజ్యసభ ఎన్నికల్లో వినియోగించుకోలేదు. రేవంత్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే రేవంత్ రాజీనామా ఇంతవరకూ స్పీకర్ ఆమోదించలేదు. స్పీకర్ కార్యాలయానికి రేవంత్ రాజీనామా చేరలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, తాను పంపానని రేవంత్ చెబుతున్నారు. శాసనసభ సమావేశాలకు కూడా రేవంత్ హాజరు కావడం లేదు. రాజ్యసభ ఎన్నికలకు కూడా రేవంత్ దూరంగానే ఉన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినందున రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు శాసనసభ్యత్వాలు రద్దయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు కూడా ఈసీ ఆదేశాలతో తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు.
Next Story

