రేవంత్ ఏకాకి కాదు... ? ఎంతమందో?

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీని రేవంత్ కలవనున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీని కలసి తన వెంట వచ్చే టీడీపీ నేతలను కూడా పరిచయం చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలను కూడా రాహుల్ కు రేవంత్ అందించనున్నారు. అయితే రేవంత్ వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో 15 మంది టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, 25 మంది నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఉన్నారు. వీరితో పాటు 8 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ వెంట కాంగ్రెస్ లో ఈరోజు చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, సోయం బాపూరావు, బోడ జనార్థన్, అరికెల నర్సారెడ్డి తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక భవన్ లో బస.....
అయితే ఢిల్లీకి తన అనుచరులు, నేతలతో కలసి వెళ్లిన రేవంత్ కు ఏపీ, తెలంగాణ భవన్ లలో గదులు లభించలేదు. ఏపీ, తెలంగాణ భవన్ లు రెండూ రేవంత్ కు గదులు కేటాయించడానికి ఇష్టపడలేదు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన పార్టీ అగ్రనేతలు రేవంత్ కోసం కర్ణాటక భవన్ లో 30 గదులను బుక్ చేశారు. కర్ణాటక భవన్ లోనే రేవంత్ బృందం బస చేసింది. ఈరోజు 12 గంటలకు రాహుల్ తో మాట్లాడిన అనంతరం సాయంత్రం 4గంటలకు అధికారికంగా ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మొత్తం మీద రేవంత్ వెంట దాదాపు 40 మంది నేతల వరకూ ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి రేవంత్ బాగానే గండికొట్టారు.
మాజీఎమ్మెల్యేలు
- వేం నరేందర్ రెడ్డి
- సీతక్క
- సోయం బాపూరావు
- బోడ జనార్థన్
- విజయ రమణారావు
- అరికెల నర్సారెడ్డి

