రేవంత్ ఎపిసోడ్ లో టిఆర్ఎస్ సైలెంట్ వెనక?

టి టిడిపి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో టిఆర్ ఎస్ అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఆంధ్రా నేతలకు కాంట్రాక్టులు ఇవ్వడం వ్యాపార లావాదేవీలు సాగించడం వంటివి కేసీఆర్ చేస్తూ తెలంగాణ వారికి ద్రోహం తలపెట్టారంటూ రేవంత్ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ రిప్లయ్ గులాబీ దళం ఇంతవరకు సరిగ్గా ఇవ్వనే లేదు. ఈ గొడవంతా టిడిపి చూసుకుంటుంది అన్నట్లు ఆ పార్టీ వ్యూహాత్మక మౌనం వహిస్తుంది. సాక్షాత్తు ఏపీ టిడిపి పెద్ద తలకాయలతో ముడి పెట్టి కేసీఆర్ వారికి కొమ్ము కాస్తున్న తీరు రేవంత్ తేటతెల్లం చేసినా తమ పార్టీ అధినేత సైలెన్స్ కావడం టిఆర్ ఎస్ శ్రేణుల్లో చర్చకు దారితీసింది.
అందుకే మౌనం ....?
ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో వున్నారు . అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఆయనతోనే వున్నారు. పయ్యావుల కేశవ్ అమెరికాలోనే వున్నారు. ఈ సమయంలో టిఆర్ ఎస్ నుంచి ఏమి మాట్లాడినా టిడిపి నేతలు వచ్చాకా వారు చెప్పేదానికి దీనికి పొంతన లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళన గులాబీ దళం లో ఉందంటున్నారు . వచ్చే ఎన్నికలకు టిఆర్ ఎస్ తో టిడిపి పొత్తు అంతర్గతంగా ఖరారు అయినందునే ఈ వ్యవహారంలో ఆచితూచి స్పందించడం మంచిదన్న యోచనలో ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారని సమాచారం. రేవంత్ ఇంకా ఎలాంటి కొత్త ఆరోపణలు , అంశాలు వెల్లడిస్తాడో చూశాకా రెండు పార్టీలు ఒకేతీరులో కౌంటర్ ఇవ్వడం మంచిదని ఇరు పార్టీల వ్యూహకర్తలు ఆలోచన మేరకు మౌనమే అన్నిటికి ఉత్తమమని నిర్ణయించారని అంటున్నారు .
- Tags
- రేవంత్ రెడ్డి

