Tue Mar 31 2026 00:26:36 GMT+0530 (India Standard Time)
రేపు అందరూ సూర్యనమస్కారాలు చేయాలన్న బాబు

రేపు ఉదయం అందరూ సూర్య నమస్కారాలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం సూర్యారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యనమస్కారం చేయాలన్నారు. సూర్యకిరణాల్లో డి విటమన్ ఉంటుందన్నారు. ప్రకృతిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుందన్నారు. దీనికి కులమతాలతో సంబంధంలేదన్నారు. ప్రతి రోజూ అరగంట పాటు ఎండలో ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుందని ఆయన చెప్పారు.
Next Story

