రెండు రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థులు వీరే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సీఎం రమేష్ కు తిరిగి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరో అభ్యర్థిగా కనకమేడల రవీంద్ర కుమార్ ను ఖరారు చేశారు. కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో మూడో అభ్యర్థిని టీడీపీ ప్రకటించకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
తెలంగాణలో వీరు.....
ఇక టీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశఆరు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఏపీ, తెలంగాణలో కేసీఆర్, చంద్రబాబు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. రేపు వీరంతా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
