రాహుల్ ఎటు తేల్చరేమిటబ్బా ...?

టి సర్కార్ దెబ్బకు దెబ్బ కొట్టాలని టి కాంగ్రెస్ స్కెచ్ గీసింది. ఆ స్కెచ్ రాహుల్ ముందు పెట్టి చాలా రోజులౌతున్నా అధిష్టానం నుంచి చేయండనో, వద్దు అని చెప్పడంలో ఆలస్యం అవుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలవరం బయల్దేరింది. కాంగ్రెస్ శాసన సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తూ టి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ధీటుగా ప్రతిస్పందించేలా కొత్త పధక రచన చేశారు టి కాంగీయులు. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఆలస్యం అమృతం విషం గా పరిణమిస్తాయని ఆందోళన చెందుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఒక పక్క ఎఐసిసి సదస్సు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ బిజీ బిజీ షెడ్యూల్స్ ఉండటంతో టి కాంగ్రెస్ వ్యూహం ఇప్పట్లో అమలు అయ్యేలా కానరావడం లేదు.
హై కోర్టు స్టే ఇవ్వకపోతే ....
శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారంపై టి కాంగ్రెస్ హై కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఒక పక్క నడుస్తూ ఉండగానే టి కాంగ్రెస్ లో ఉన్నవారంతా మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం అమలు చేయాలో లేదా అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ ముందు ఉంచారు. అయితే రాహుల్ నుంచి ఒకే రాకపోవడం నో అని కూడా చెప్పకపోవడం టి కాంగీయులను సందిగ్ధం లోకి నెట్టింది. మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం వద్ద శాసన సభ్యత్వాల రద్దు వివాదం ఇంకా తేల్చలేదు. ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయం ప్రకటించే ముందే హై కోర్ట్ స్టే రావాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు జరిపిస్తే ప్రభావం ఎలా వుండబోతుందన్న ఆందోళన ఇప్పుడు వారిని వెంటాడుతుంది.
- Tags
- రాహుల్
