రావెల రివర్స్ అయింది ఇందుకే

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం డిసైడ్ అయింది. అదే సామాజిక వర్గానికి చెందిన నేతను ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి రంగంలోకి దించింది. రావెల కిశోర్ బాబు ఇటీవల చంద్రబాబుతో పాటు టీడీపీపైన కూడా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ప్రత్తిపాడు కు రప్పించి మరీ సభను జరపడం అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను రంగంలోకి దించాలని భావిస్తుంది. ఇప్పటికే డొక్కాకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అసలు డొక్కా ఎంట్రీతోనే రావెల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్లమెంటు సభ్యుడు రాయపాటికి అత్యంత సన్నిహితుడు. రాయపాటితో పాటో కాంగ్రెస్ నుంచి డొక్కా కూడా టీడీపీలోకి వచ్చారు.
డొక్కాకు ప్రాధాన్యం పెరిగిందనేనా?
కాని ఇతర పార్టీల నుంచి వచ్చని నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని రావెల తోపాటు మరికొందరు నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే రావెల మాత్రం తన అసంతృప్తిని బహిరంగంగానే బయట పడ్డారు. అప్పటి నుంచి రావెలకు కష్టాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. అంతే కాకుండా డొక్కా పార్టీలోకి వచ్చిన తర్వాత రావెల ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తోంది. తనకు చెక్ పెట్టేందుకే డొక్కాను పార్టీలోకి తీసుకువచ్చారని రావెల అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో డొక్కాను ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న వార్తలతో రావెల మరింత రెచ్చిపోతున్నారు. అంతేకాకుండా ఇటీవల గుర్రం జాషువా జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు కన్వీనర్ బాధ్యతలను ఎమ్మెల్సీ డొక్కాకు అప్పగించింది. మంత్రి పదవి ఊడిన తర్వాత సైలెంట్ గా ఉన్న రావెల తనకు చెక్ పెట్టేందుకు డొక్కాను దించడంతో ఆయన రివర్స్ అవుతున్నారని తెలుస్తోంది.
- Tags
- రావెల

