Sun Dec 14 2025 18:48:16 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రి పది దాటితే మందుబాబులు జైలుకే

న్యూ ఇయర్ సంబరాలకు సిద్దమవుతున్న మందు బాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31న తాగి వాహనంనడిపితే చర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ కాప్స్...31న రాత్రి పదినుంచి ఉదయం ఐదు గంటల వరకు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టనున్నారు. వందకు పైగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని..తనిఖీలు మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తామని తెలిపారు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు. తాగి వాహనం నడిపి పట్టుబడ్డ వాహనాలను అక్కడే సీజ్ చేస్తామంటున్నారు. గతేడాది డిసెంబర్ 31వేడుకల్లో పట్టుబడ్డ 7500 మంది వాహనదారులకు ఒక్కరోజు నుంచి గరిష్టంగా 15 రోజుల జైలుశిక్ష న్యాయస్దానం విధించనట్లు ప్రకటించారు. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలుకు వెళ్లిన వారి వివరాలు ఆధార్ కు అనుసందానం చేయటంతో ఉద్యోగులకు, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కు ఇబ్బంది ఉంటుందని హెచ్చరించారు.
- Tags
- న్యూ ఇయర్
Next Story
