Mon Mar 23 2026 21:06:18 GMT+0530 (India Standard Time)
రాజ్ భవన్ కు చేరిన లెజెండ్ వ్యవహారం

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పై గవర్నర్ నరసింహన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గవర్నర్ నరసింహన్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీపై అసభ్యకరంగా మాట్లాడిన బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ లు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద బాలకృష్ణ వ్యవహారం రాజభవన్ కు చేరింది.
Next Story

